భారతదేశం, ఏప్రిల్ 2 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ ఒక జీవో జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల(ఎన్నికైన సభ్యుల సంఖ్యను నిర్ధారించే) నియమావళి, 2005ను సవరించింది. డివిజన్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని కార్పొరేషన్లలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారతాయి. అలాగే మేయర్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

జీవీఎంసీలో ప్రస్తుతం 98 డివిజన్లు ఉన్నాయి. వీటిని 120 డివిజన్లకు పెంచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు పెరిగాయి. గుంటూరు కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లతో పాటు అదనంగా 19 డివిజన్లు చేరాయి. దీంతో ఆ సంఖ్య 76కు పెరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్యను 18 పెం...