ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వాన
భారతదేశం, అక్టోబర్ 22 -- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు ప్రారంభమవగా, రానున్న కొద్ది గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో రాబోయే మూడు గంటల వ్యవధిలో ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని ప్రజలను హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అమలాపురం, కాట్రెనికోనతో పాటు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.