భారతదేశం, అక్టోబర్ 4 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పారిశ్రామిక పెట్టుబడికి బాటలు సుగమమయ్యాయి. నెల్లూరు జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏర్పాటు చేయబోతున్న భారీ 'గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్' ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుమారు రూ.1,03,408 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రామాయపట్నం పోర్టు సమీపంలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశంలోనే మూడో అతిపెద్ద ఇంధన శుద్ధి సంస్థ అయిన బీపీసీఎల్, నెల్లూరులో దాదాపు 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్...