భారతదేశం, మార్చి 20 -- రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ జీఓ ఆర్టీ సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగింది.

అయితే శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు ఆయన వెల్లడించారు. 20వ తేది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయని సీఎస్ స్పష్టం చేశారు.

అదే విధంగా షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881కు అనుగుణంగా రంజాన్ సాధార...