భారతదేశం, అక్టోబర్ 18 -- ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ వైద్య విద్య అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(Dr.NTRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పీజీ (మెడికల్) డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ-2026 అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ప్రవేశాల ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అన్‌ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ 19 సాయంత్రం 4:00 గంటల నుండి మెుదలవుతుంది. దరఖాస్తు ముగింపు తేదీ అక్టోబర్ 23 రాత్రి 10:00 గంటల వరకు ఉంటుంది.

లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకు...