ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ అలర్ట్ - ఈనెల 18 వరకు వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 17 -- ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 18 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది.
కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అక్కడక్కడా కుండపోత వర్షాలు పడవచ్చు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ 3 రోజుల కాలంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అకస్మాత్తుగా వీచే బలమైన ఈదురుగాలుల వల్ల చేతికొచ్చిన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన ముందస్తు జాగ్రత్తల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.