భారతదేశం, జూలై 7 -- నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కాకుండా అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. బలమైన గాలుల పట్...