అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప.. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు
భారతదేశం, సెప్టెంబర్ 22 -- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. అశ్వ వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడిగా ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తున్నారు. కృష్ణయజుర్వేదం పరమాత్మను అశ్వ స్వరూపంగా తెలియజేస్తుంది.
కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్ప స్వామివారు కలియుగ దోషాలకు దూరంగా ఉండి, నామసంకీర్తనను ఆశ్రయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.