భారతదేశం, అక్టోబర్ 19 -- తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాల మధురనాదాలు, భక్తజనుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషతో అశ్వవాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు

సనాతన ధర్మంలో అశ్వం వేగానికి, శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను బోధించాయి. అశ్వవాహనంపై విహరించే శ్రీమహావిష్ణువు సమస్త ఇంద్రియాలకు నియామకుడని, మనిషి తన ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ధర్మమార్గంలో పయనించాలని ఈ వాహనసేవ ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది.

కలియుగంలో అధర్మాన్ని రూపుమాపి,...