భారతదేశం, మార్చి 4 -- అవయవాల దానoలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ( కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అపెక్స్ బాడీ ) రాష్ట్రాల వారీగా అవయవ దానo జాబితా-2025ను ప్రకటించింది. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఏర్పాటు అయిన జీవన్ దాన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తుందన్నారు.

ఇటీవల హైకోర్టు ప్రభుత్వాసుపత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలో మంత్రి సత్య కుమార్ వైద్య ఆరోగ్య, జీవన్ దాన్ ట్రస్ట్ అధికారులతో సమీక్ష జరిపారు. అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే ఆసుపత్రుల సంఖ్య మూడు నుంచి తొమ్మిదికి పెరిగిందన్...