భారతదేశం, మే 23 -- Allu arjun meets Crickter Venkatesh Iyer : భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కలిశారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలెంటెడ్ యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని ఈరోజు కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. వెంకటేష్ అయ్యర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్బంగా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం తన సంతకంతో కూడిన ఒక ప్రత్యేకమైన క్రికెట్ జెర్సీని (Signed Jersey) అందించాడు. అయాన్‌కు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినందుకగాను అల్లు అర్జున్ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు (Special Thanks) తెలియజేశారు.

"ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్య...