భారతదేశం, అక్టోబర్ 30 -- అర్నబ్ తుపాను తీవ్రత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ప్రతి గంటకూ దాని కదలికలను నిశితంగా పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సమర్థవంతమైన నిర్వహణ వల్లనే తుపాను తీవ్రత నుంచి భారీగా ప్రాణనష్టాన్ని నివారించగలిగామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 4,600 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో సంభవించిన నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నష్ట ...