భారతదేశం, అక్టోబర్ 27 -- అర్నబ్‌ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను సన్నద్ధత, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, అత్యవసర సేవలపై సమీక్షించారు.

తుపాను ప్రభావం లేని ప్రాంతాల్లోని అవసరమైన సిబ్బంది సెలవులను రద్దు చేసి, ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ...