భారతదేశం, నవంబర్ 8 -- యువ క్రికెట్ సమరంలో పాకిస్థాన్ దే పైచేయి అయింది. అండర్-19 ఆసియా కప్‌లో ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అర్జున్ రాజ్‌పుత్ వీరోచిత శతకంతో భారత్ పోరాడే స్కోరు సాధించినప్పటికీ, హంజా జహూర్ బాధ్యతాయుతమైన సెంచరీతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో టోర్నీలో పాక్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, భారత్ తన తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పాకిస్థాన్ సీమర్లు రిజ్వాన్ ఉల్లా, అలీ రెజా అద్భుతమైన స్వింగ్, బౌన్స్‌తో భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. పరుగులు తీసేందుకు భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఫలితంగా 12వ ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడి...