భారతదేశం, జూన్ 28 -- అయోధ్య రామాలయ విరాళాల సేకరణలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుల నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో ఆరు పోలీసు బృందాలు ఉదయం 7 గంటల నుంచే విస్తృత సోదాలు చేపట్టాయి.

విచారణలో భాగంగా నిందితుల కుటుంబ సభ్యులను వారి ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు ప్రశ్నించారు. అలాగే, నిందితుల కదలికలు, వారి వద్దకు వచ్చే వెళ్లే వ్యక్తుల వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు పొరుగువారితో కూడా మాట్లాడారు. ఈ కుట్రలో మరికొంత మంది ప్రమేయం ఉందా అనే కోణంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శ్రీ...