భారతదేశం, జూలై 22 -- హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సింహంతో విడదీయరాని అనుబంధం ఉంది. శివుని వ్యాఖ్యతో పార్వతీదేవి తపస్సు చేయడం, ఆమె కోసం ఓ సింహం ఏళ్ల తరబడి వేచి చూడటం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఇక్కడ తెలుసుకోండి.

మన హిందూ శాస్త్రాలు, పురాణాల ప్రకారం చూసినట్లయితే, దుర్గాదేవి సింహంపై విహరించే రూపంతో కనిపిస్తుంది. శక్తి, నిర్భయత్వం, విజయానికి ప్రతీకగా ఈ రూపం భావించబడుతుంది. సింహం కేవలం అమ్మవారి వాహనమే కాదు, అమ్మవారి దివ్య తేజస్సు, ధైర్యం, పరాక్రమానికి చిహ్నం కూడా. ఈ అనుబంధం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.

పురాణాల ప్రకారం చూస్తే, ఓ రోజు శివుడు సరదాగా పార్వతీదేవిని "కాళి" అని అంటాడు. తన వర్ణాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యతో పార్వతీదేవికి ఆవేదన కలిగింది. ఆమె అరణ్యానికి వెళ్లి కఠిన తపస్సు చేయడం మొదలు పెట్టింది. తన తపస్సు ద్వారా ...