భారతదేశం, మార్చి 5 -- వాషింగ్టన్/కాలిఫోర్నియా: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన 'డూమ్స్‌డే' (ప్రళయకాల) క్షిపణిని ప్రయోగించి సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ 'మినిట్‌మ్యాన్ III' (Minuteman III) బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు.

నిరాయుధంగా ప్రయోగించిన ఈ క్షిపణి (GT 254), పసిఫిక్ మహాసముద్రం మీదుగా వేల మైళ్ల దూరం ప్రయాణించి మార్షల్ ఐలాండ్స్ సమీపంలోని తన లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. ఇరాన్, దుబాయ్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో ఈ ప్రయోగం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మినిట్‌మ్యాన్ III అనేది అమెరిక...