భారతదేశం, ఆగస్టు 26 -- అమెరికాలో స్థిరపడాలనుకునే ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు, అపాయింట్‌మెంట్‌లను తాత్కాలికంగా రద్దు చేసింది. విదేశాంగ శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసే క్రమంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. అమెరికా ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్న (Public Charge) దరఖాస్తుదారులను ప్రాథమిక దశలోనే గుర్తించి నిరోధించడానికి కాన్సులర్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు ప్రతీ వీసా అపాయింట్‌మెంట్‌ను మరింత నిశితంగా, ఒకే విధమైన ప్రామాణికతతో పరి...