భారతదేశం, మార్చి 9 -- భారత స్టాక్ మార్కెట్ సోమవారం (మార్చి 9, 2026) భారీ పతనాన్ని చవిచూసింది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై స్పష్టంగా కనిపించింది. కీలక మద్దతు ధరలను కోల్పోయిన నిఫ్టీ.. యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే 22,000 లేదా ఏకంగా 19,000 స్థాయికి పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వారపు మొదటి రోజే ఇన్వెస్టర్లకు చేదు అనుభవం ఎదురైంది. అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు కుప్పకూలాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు బ్యారెల్‍కు దాదాపు 120 డాలర్ల మార్కును తాకడం మన మార్కెట్లను కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' మార్గంలో ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపె...