భారతదేశం, మార్చి 11 -- అమెరికా ఇంధన రంగంలో ఒక భారీ సంచలనం నమోదైంది. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో సుమారు $300 బిలియన్ల (దాదాపు Rs.25 లక్షల కోట్లు) వ్యయంతో సరికొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందమని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతున్న భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించడం గమనార్హం.

తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ధన్యవాదాలు తెలిపారు. "ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు మా భారతీయ భాగస్వాములకు, ముఖ్యంగా వారి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్‌కు నా కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నా...