అమెరికాలో హ్యూమనాయిడ్ రోబోల జోరు.. 2030 నాటికి 4 లక్షలకు చేరిక
భారతదేశం, నవంబర్ 12 -- న్యూయార్క్: మనిషి ఆకారంలో ఉండి పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోల శకం వేగంగా విస్తరిస్తోంది. కేవలం ప్రదర్శనల దశ నుంచి వాణిజ్య వినియోగం వైపు ఈ పరిశ్రమ అడుగులు వేస్తుండటంతో, అమెరికాలో వీటి ఉత్పత్తి భారీగా పెరగనుంది. 2030 నాటికి యూఎస్‌లో హ్యూమనాయిడ్ రోబోల ఉత్పత్తి 3 లక్షల నుంచి 4 లక్షల యూనిట్లకు చేరుతుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ గురువారం అంచనా వేసింది. 2035 నాటికి ఈ సంఖ్య ఏకంగా 15 లక్షల (1.5 మిలియన్) యూనిట్లకు ఎగబాకుతుందని నివేదికలో వెల్లడించింది.
తయారీ, లాజిస్టిక్స్, గిడ్డంగుల (వేర్‌హౌసింగ్) రంగాల్లో ఒకే తరహా పనులను యాంత్రీకరించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కార్మికుల కొరత తీవ్రంగా ఉండటం, ఆర్థికంగా లాభదాయకత మెరుగుపడటం, ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వంటి అంశాలు హ్యూమనాయిడ్ రోబోల వినియోగాన్ని పరుగులు పెట్టి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.