భారతదేశం, అక్టోబర్ 16 -- అమెరికాకు వెళ్లాలనుకునే వారికి, ఇప్పటికే అక్కడ నివసిస్తున్న విదేశీయులకు కీలక పరిణామం ఎదురైంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పలు ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించిన రుసుములను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ కొత్త చార్జీలు నేటి నుంచే (అక్టోబర్ 16, 2026) అమలులోకి వస్తున్నాయి.

హెచ్.ఆర్ 1 రీకాన్సిలియేషన్ చట్టం ప్రకారం ప్రతిఏటా చేపట్టే ద్రవ్యోల్బణ సర్దుబాటులో భాగంగానే ఈ ఫీజులను పెంచినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది. జులై 2025 నుంచి జులై 2026 మధ్య నమోదైన ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ స్వల్ప సవరణలు చేశారు. సెప్టెంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 16 లేదా ఆ తర్వాత పోస్ట్ చేసే దరఖాస్తులకు కొత్త రుసుములే వర్తిస్తాయి. సరైన ఫీజు చెల్లించని దరఖాస్తులను తిరస్కరి...