భారతదేశం, ఫిబ్రవరి 12 -- యూఎస్‌లో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో జాహ్నవి కందుల అనే తెలుగు అమ్మాయి మృతిచెందింది. అంతేకాదు ఈ సమయంలో పోలీస్ అధికారి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలంగా మారాయి. భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా సియాటెల్ సిటీ సెటిల్‌మెంట్ కోసం వచ్చింది. 29 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ కరెన్సీలో చూస్తే సమారు రూ.262 కోట్ల రూపాయలు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ నుంచి ప్రకటన విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్‌లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. జనవరి 2023లో ఆమె రోడ్డు దాటుతూ ఉండగా.. వేగంగా కారు నడుపుతూ వచ్చాడు సియటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్. జాహ్నవిని ఢీక...