అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - మహబూబాబాద్ జిల్లా వాసి మృతి, స్వగ్రామంలో తీవ్ర విషాదం!
భారతదేశం, అక్టోబర్ 5 -- అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా వాసి మృతి చెందారు. ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో దారం సుప్రియ (31) అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ విషాద ఘటనతో ఆమె స్వగ్రామంలోని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.... మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో నివాసముంటున్నారు. స్థానిక సెయింట్ లూయిస్లోని ఒక రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్న ఆమె.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పనులు ముగించుకుని తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి తిరుగుపయనమయ్యారు.
సరిగ్గా ఆదివారం వేకువజామున 2:20 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఒక వేగవంతమైన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.