భారతదేశం, జూన్ 17 -- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ) డీ-నోటిఫికేషన్ వ్యవహారంలో ప్రముఖ సంస్థ 'ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్'కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఈ వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను (స్టే ఆర్డర్) సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది.

న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్ల...