భారతదేశం, ఆగస్టు 14 -- Amaravati Land Pooling Case : రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో వారిపై నమోదైన కేసును కొట్టివేస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ కీలక పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాకుండా.. ఈ పిటిషన్‌ ఫలితం ఇతర కేసులపై...