భారతదేశం, ఆగస్టు 4 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) మరొక కీలక ముందడుగు వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రవాణా వ్యవస్థ, అనుసంధాన ప్రణాళికలను రూపొందించేందుకు సీఆర్‌డీఏ గ్రామ సభలను అధికారికంగా ప్రారంభించింది.

రాజధాని పరిధిలోని నార్త్-వెస్ట్ గ్రిడ్ పరిధిలో ఉన్న అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల్లో మెుదటి గ్రామ సభలను నిర్వహించారు.

అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధాని నగరంతో స్థానిక గ్రామాలను ఏ విధంగా అనుసంధానించాలి, గ్రామీణ రహదారుల నెట్‌వర్క్‌ను ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం.

ప్రతిపాదిత రహదారుల నెట్‌వర్క్, గ్రామాల విలీనం, రహదారుల వెడల్పు ప్రక్రియలపై స్థానిక నివాసితులకు సీఆర్‌...