భారతదేశం, ఏప్రిల్ 1 -- అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు - 2026పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గురించి కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు.

సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందన్నారు. ఆ తర్వాత చివరిదశ తెలంగాణ ఉద్యమంలోనూ.. 1200 మంది ఆత్మబలిదానం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి...