భారతదేశం, అక్టోబర్ 13 -- Sobhita Dhulipala On Never Married An Actor: అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి వార్తా సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత కామెంట్స్‌పై శోభితా స్పందించడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

గతంలో 'నేను ఎప్పటికీ ఒక నటుడిని ప్రేమించను, డేటింగ్ చేయను, పెళ్లి చేసుకోను' అని శోభితా చెప్పిన మాటలను నెటిజన్లు తరచూ ప్రస్తావిస్తుంటారు. 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఇంటర్వ్యూలో ఈ విషయంపై శోభిత ధూళిపాళ నేరుగా వివరణ ఇచ్చారు.

"మానవ ఆలోచనా విధానం కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. అభిప్రాయాలు మార్చుకోవడానికి భయపడేవారే ఎప్పటిక...