భారతదేశం, అక్టోబర్ 12 -- Ekta Kapoor About Worst Year And Overconfidence: భారతీయ బుల్లితెర రూపురేఖలను మార్చేసి, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్ సీరియళ్లను అందించిన లేడి నిర్మాత ఏక్తా కపూర్ అంటే తెలియనివారు ఉండరు. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కహానీ ఘర్ ఘర్ కీ' వంటి సీరియళ్లతో దశాబ్దానికి పైగా కోట్లాది మంది ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేసిన ఆమె, తన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ తన కెరీర్, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.

మన దేశంలో సోషల్ మీడియా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న రోజుల్లో తనకు ఎదురైన పరిస్థితులను ఏక్తా కపూర్ గుర్తుచేసుకున్నారు. ఆరంభంలో ఆర్కుట్ ...