భారతదేశం, ఆగస్టు 10 -- Panchali Panchabhartruka Pre Release Event: నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా పాంచాలి పంచభర్తృక చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు.

ఈ నెల 14న 'పాంచాలి పంచభర్తృక' సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్ట్ 9) సాయంత్రం పాంచాలి పంచభర్తృక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్...