భారతదేశం, జూలై 6 -- రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 14 వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను పూర్తి చేయడానికి రూ.90.20 కోట్లు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈ వంతెనలు.. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఈ 14 వంతెనలలో రెండు రాష్ట్ర రహదారులపై, మిగిలినవి ప్రధాన జిల్లా రహదారులపై ఉన్నాయి.

గతంలో పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఈ బ్రిడ్జి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. మాడుగులలో 2 వంతెనలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున అంటే అనకాపల్లి, పాయకరావుపేట, పిఠాపురం, కైకలూరు, భీమవరం, గన్నవరం, పెనమలూరు, దర్శి, సత్యవేడు, గూడూరు, పులివెందుల, జగ...