భారతదేశం, అక్టోబర్ 20 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసు పరిధిలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గబ్బడ గ్రామం సమీపంలో దాదాపు 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు కోట్లలో ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శశి కుమార్ (52) తమిళనాడులోని తంజావూరు వాసి (ముఠా నాయకుడు), పాంగి సుబ్బారావు (21) అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా జి.మ...