భారతదేశం, నవంబర్ 26 -- అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని, వేగంగా వస్తున్న తుపాన్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

తాడిపత్రి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి, తిరిగి తుపాన్ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో రాయలచెరువు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి తుపాన్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. తెల్లవారుజాము సమయం కావడంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని గుర్తించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప...