భారతదేశం, డిసెంబర్ 25 -- థాయిలాండ్-కాంబోడియా సరిహద్దులో విష్ణు విగ్రహం ధ్వంసం కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, థాయిలాండ్ ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించింది. భారత్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న కారణాలను థాయిలాండ్ వివరించింది. ఇది కేవలం భద్రతాపరమైన చర్యే తప్ప, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసింది కాదని స్పష్టం చేసింది.

థాయిలాండ్-కాంబోడియా సరిహద్దు ప్రెస్ సెంటర్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. "ఈ చర్య మతాలకు లేదా నమ్మకాలకు సంబంధించింది కాదు. థాయ్ దళాలు ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, కేవలం ఏరియా మేనేజ్‌మెంట్, భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఈ తొలగింపు చేపట్టాం" అని పేర్కొంది.

థాయిలాండ్ అధికారుల ప్రకారం.. ధ్వంసం చేసిన విగ్రహం అధికారికంగా నమోదైన మతపరమైన స్థలం కాదు. వివాదాస్పద సరిహద్దు ప్రా...