భారతదేశం, మే 22 -- వైద్య పరిశోధనల ప్రకారం, మన శరీర ఉష్ణోగ్రత 40degC దాటినప్పుడు కణాల స్థాయిలో మార్పులు మొదలవుతాయి. దీన్నే 'టిప్పింగ్ పాయింట్' అంటారు.

కణాల మరణం (Cellular Death): అత్యధిక వేడి వల్ల రక్త కణాలు (Platelets) దెబ్బతింటాయి. ఇది శరీరంలో మంట (Inflammation), ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టడానికి (Blood Clotting) దారితీస్తుంది.

అవయవాల వైఫల్యం: హైపర్‌థెర్మియా వల్ల మైటోకాండ్రియా దెబ్బతిని, మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ (అనేక అవయవాలు పని చేయకపోవడం) జరిగే అవకాశం ఉంది.

గుండెపై ఒత్తిడి: శరీరాన్ని చల్లబరచడానికి గుండె సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారిలో స్ట్రోక్స్ లేదా అరిథ్మియాకు దారితీస్తుంది.

50 ఏళ్లు దాటిన వారు, ఊబకాయులు, గుండె, ఊపిరితిత్తులు లేదా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు అత్యం...