అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో మీసేవ సర్టిఫికెట్లు.. కొత్త పేపర్‌తో ఇక లామినేషన్ అవసరం లేదు!
భారతదేశం, అక్టోబర్ 13 -- ప్రభుత్వ సర్టిఫికెట్ల రక్షణ, మన్నిక, నకిలీల నిరోధమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన జనరేషన్ సెక్యూరిటీ పేపర్‌ను రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు.
ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్ల తయారీని పూర్తిగా అరికట్టేందుకు ఈ కొత్త పేపర్‌లో అత్యంత భద్రతతో కూడిన 15 రకాల అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. భద్రతా కారణాల రీత్యా ఈ ఫీచర్ల వివరాలను వెల్లడించలేదు. ప్రత్యేక సాంకేతికతతో తయారైన ఈ కాగితం సులభంగా చిరిగిపోదు, నీటిలో తడిచినా పాడవదు. నిత్యం వాడటం, మడతపెట్టడం, సుదీర్ఘకాలం దాచి ఉంచడం వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకునేలా దీనిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.