భారతదేశం, సెప్టెంబర్ 30 -- మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో అక్టోబర్ 2న అన్ని రకాల జంతు వధశాలలు (స్లాటర్‌హౌస్‌లు), మాంసం, బీఫ్ విక్రయ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, ఆయన విశిష్టతను గౌరవిస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులు అక్టోబర్ 2న పూర్తిగా మూతపడనున్నాయి.

హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా...