అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ.. మెట్రో టేకోవర్‌పై కీలక అప్డేట్ వచ్చే అవకాశం!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 1న అత్యవసరంగా భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా పంపిణీ చేయనున్న 'ఇందిరమ్మ చీరల' పథకంతో పాటు ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే నిధుల సమీకరణ ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 11 నుండి 18 వరకు జరగనుంది. ఈ పండుగ పురస్కరించుకుని రాష్ట్రంలోని సుమారు కోటి మంది నిరుపేద మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఏడాది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న ఈ చీరల పంపిణీని చేపట్టారు. అయితే ఈ ఏడాది ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.