భారతదేశం, సెప్టెంబర్ 25 -- శుక్రుడు ప్రేమ, సౌందర్యం, ఆకర్షణ, సంపద, భౌతిక సౌకర్యాలకు కారణమని భావిస్తారు. అందువల్ల శుక్రుని రాశిలో లేదా సంచారంలో మార్పులు 12 రాశుల వారి జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు.. అక్టోబర్ 3న అదే రాశిలో వక్రగమనాన్ని ప్రారంభించనున్నాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, శుక్రుని ఈ వక్రగమనం కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక విషయాలు, సంబంధాలలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. కొన్ని రాశుల వారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు.

శుక్రుడు 2026 అక్టోబర్ 3, శనివారం మధ్యాహ్నం 12:45 గంటలకు తులారాశిలో తన వక్రగమనాన్ని ప్రారంభించనున్నాడు. సుమారు 42 రోజుల పాటు ఈ స్థితిలో సంచరించిన తర్వాత నవంబర్ 14న మళ్లీ ప్రత్యక్ష గమనాన్ని ప్రారంభిస్తాడు. ఈలోగా నవంబర...