భారతదేశం, జూన్ 12 -- రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా అక్టోబర్ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ-2025 నియామకాలపై మరొకసారి సమగ్ర వివరణ ఇచ్చారు. డీఎస్సీ-2025 నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొంత మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్...