అక్టోబర్లో దిమ్మ తిరిగిపోయేలా వాటర్ ట్యాంకర్ల బుకింగ్.. ఇది చలికాలమేనా?
భారతదేశం, నవంబర్ 6 -- సాధారణంగా మే, ఏప్రిల్ వంటి వేసవి కాలంలో కనిపించే నీటి ఎద్దడి దృశ్యాలు ఈసారి అక్టోబర్ నెలలోనే భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మెున్నటి అక్టోబర్ నెలలో ఏకంగా 2.20 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్ బుకింగ్లు నమోదై రికార్డు సృష్టించాయి. గతేడాది అక్టోబరులో కేవలం 87 వేల ట్యాంకర్లు మాత్రమే బుక్ అవ్వగా, ఈసారి అది రెట్టింపు కంటే ఎక్కువ కావడం నగరంలో నెలకొన్న నీటి తీవ్రతకు అద్దం పడుతోంది.
సాధారణంగా వర్షాకాలంలో రోజూ 1,500 నుంచి 2,000 ట్యాంకర్లకు మించి డిమాండ్ ఉండదు. కానీ ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడమే దీనికి ప్రధాన కారణం. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు పెరగకపోగా, భానుడి తాకిడికి రోజురోజుకూ మరింత అట్టడుగుకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.