భారతదేశం, సెప్టెంబర్ 10 -- కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి(NH 563) నాలుగు లేన్ల విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. NHAI అధికారులు ఈ రహదారిపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా పండుగ కానుకగా ఈ రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవడానికి సుమారు 90 నిమిషాలు(గంటన్నర) సమయం పడుతుండగా, ఈ నూతన నాలుగు లేన్ల రహదారి ప్రారంభమైన తర్వాత ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. దాదాపు గంటలోపే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన భారత్‌మాల పథకం కింద 68 కిలోమీటర్ల ...