అక్టోబర్లో అందుబాటులోకి కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే.. గంటలోపే జర్నీ
భారతదేశం, సెప్టెంబర్ 10 -- కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి(NH 563) నాలుగు లేన్ల విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. NHAI అధికారులు ఈ రహదారిపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా పండుగ కానుకగా ఈ రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవడానికి సుమారు 90 నిమిషాలు(గంటన్నర) సమయం పడుతుండగా, ఈ నూతన నాలుగు లేన్ల రహదారి ప్రారంభమైన తర్వాత ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. దాదాపు గంటలోపే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన భారత్మాల పథకం కింద 68 కిలోమీటర్ల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.