భారతదేశం, ఆగస్టు 14 -- Zee Telugu Bonalu Jatharaki Vastunnam TV Premiere: తెలంగాణ సంస్కృతికి, విశిష్ట సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాల పండుగ. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఊరూరా ఎంతో వైభవంగా జరిగే ఈ ఆమ్మవారి ఉత్సవాలను బుల్లితెర ప్రేక్షకులు మెచ్చేలా జీ తెలుగు ఛానల్ ప్రతిసారీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటుంది.

ఈసారి కూడా తెలంగాణ హృదయాల ప్రతిరూపమైన ఓరుగల్లు గడ్డపై జీ తెలుగు కుటుంబం సందడి చేసింది. హన్మకొండలోని రెవెన్యూ కాలనీ, సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా 'బోనాల జాతరకి వస్తున్నాం' పేరుతో భారీ మెగా ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.

వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది అభిమానుల కోలాహలం మధ్య ఈ వేడుక కన్నులపండువగా సాగింది. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ మెగా వినోద కార్యక్రమం ఆగస్టు 16...