భారతదేశం, ఏప్రిల్ 6 -- అడివి శేష్, మృనాల్ ఠాకూర్‌ జంటగా నటించిన మూవీ 'డెకాయిట్'. రాబరీ నేపథ్యంలో లవ్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ముంబయిలో, హైదరాబాద్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ ఈవెంట్లలో అందరి ఫోకస్ నటి జైన్ మేరీ ఖాన్ మీదే పడింది.

ఇప్పుడు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో జైన్ మేరీ ఖాన్ పేరు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందాల భీభత్సంతో అదరగొట్టిన ఈ బ్యూటీ ఎవరు? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇది బోల్డ్ అరాచకం అంటూ జైన్ మేరీ ఖాన్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసేస్తున్నారు.

ఇటీవల డెకాయిట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్, యాక్షన్, రివేంజ్ తో సాగే ఈ ట్రైలర్ అదిరిపోయింది. అయితే ట్రైలర్ కంటే కూడా జైన్ మేరీ ఖాన్ వైరల్ గా మారిందని చెప్పొచ్చు. డెకాయిట్ సినిమాతో టాలీవ...