భారతదేశం, ఏప్రిల్ 2 -- తమిళ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించిన మూవీ 'యూత్' (Youth). కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదలై మంచి ఆదరణ పొందింది.

కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. యువత మనోభావాలను ప్రతిబింబించే కథాంశంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం తమిళంలోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

థియేటర్లలో సత్తా చాటిన ఈ యూత్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఏప్రిల్ 17 నుంచి అన్ని ప్రధాన ఇండి...