భారతదేశం, ఏప్రిల్ 15 -- Yash Ramayana: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ'. నితేష్ తివారీ దర్శకత్వంలో రూ.4000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యష్ మధ్య జరిగే పోరాట దృశ్యాలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

రామాయణ సినిమాలో రణ్‌బీర్ కపూర్, యష్ మధ్య సీన్లు సెకండ్ పార్టులోనే ఉండబోతున్నాయి. సినిమాకాన్ వేడుకలో భాగంగా యష్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ చిత్ర మొదటి భాగంలో రణ్‌బీర్ కపూర్, తాను కలిసి నటించిన దృశ్యాలు ఉండవని అతను స్పష్టం చేశాడు.

రెండో పార్ట్ లోనే

"రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో రావణుడిగా నాకు సొంత సామ్రాజ్యం ...