భారతదేశం, ఆగస్టు 31 -- Yash Mother: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా సంచలన చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గతంలో యశ్‌ను ఉద్దేశించి చేసిన పాత కామెంట్లు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారాయి. "కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎవరు?" అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు.

గతంలో 'కేజీఎఫ్' సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడిదే అన్న కోణంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. "ఆ సినిమా రాకముందు యశ్ ఎవరు?" అనే వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్' సినిమా థియేటర్లలో రన్ అవుతున్న వేళ ఈ ఇష్యూ మళ్లీ తెరపైకి రావడంతో యశ్ తల్లి పుష్ప ఒక ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ పేరు ఎత్తకుండానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

"కేజీఎ...