భారతదేశం, జూలై 30 -- Yash Horror Movies: 'కేజీఎఫ్' (KGF) సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రికార్డుల సునామీ సృష్టించి, ప్రస్తుతం 'రామాయణం' (Ramayana) సినిమాలో లంకేశ్వరుడిగా రచ్చ చేస్తున్న రాకింగ్ స్టార్ యశ్ తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. వెండితెరపై ఎంతటి భయంకరమైన శత్రువునైనా మట్టికరిపించే మాస్ హీరోగా కనిపించే యశ్.. రియల్ లైఫ్‌లో హారర్ సినిమాలు చూసేందుకు అస్సలు ఇష్టపడనని తెలిపారు.

ఇటీవల వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన యశ్.. తాను దెయ్యాల సినిమాలు లేదా హారర్ కంటెంట్‌కు ఎందుకు దూరంగా ఉంటారో సరదాగా వెల్లడించారు.

"నాకు భయపడటం అస్సలు ఇష్టముండదు. మనకు మనంగా థియేటర్‌కి వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు భయపడాలి? హారర్ సినిమాలు చూస్తే అనవసరంగా గుండె వేగం పెరుగుతుంది. అందుకే నేను ఆ జోనర్‌కి చ...